షేక్​ మైహిరా విడాకులు!

Sheikh Maihira divorce!

Jul 17, 2024 - 20:14
 0
షేక్​ మైహిరా విడాకులు!

దుబాయ్: దుబాయ్​ యువరాణి షేక్​ మైహిరా ఖాన్​ (షైఖా హ్రా మహ్మద్​ రషీద్ అల్​ మక్తూమ్​) సామాజిక మాధ్యమ వేదికగా తన భర్తకు విడాకులిస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త షేక్​ మనా బిన్​ తో విడిపోతున్నట్లుగా బుధవారం వెల్లడించారు. వీరికి వివాహం జరిగి కేవలం ఒక ఏడాది మాత్రమే గడిచింది. రెండు నెలల క్రితమే ఆడపిల్లకు జన్మనిచ్చారు. కాగా ఇన్​ స్టాలో ఆమె ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సహచర్యాన్ని ఇష్టపడుతునారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన్ను అన్​ ఫాలో చేశారు. ఇరువురు కలిసి గతంలో తీసుకున్న ఫోటోలను డిలీట్​ చేశారు. 
దుబాయ్​ రాజు షేక్​ మహ్మద్​ బిన్​ రషీద్​ కు మైహీరా అంటే అత్యంత ఇష్టం. ఈమెకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ఆయన తన కుటుంబంలో ఎవ్వరికీ ఇవ్వకపోవడం గమనార్హం. మైహీరా ప్రస్తుతం మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. వీరిద్దరి విడాకుల ప్రకటనపై సామాజిక మాధ్యమంగా తీవ్ర దుమారమే చెలరేగుతోంది.