జాతీయ జెండాకు అవమానం ఇద్దరు అరెస్టు
Two arrested for insulting the national flag
పట్నా: బిహార్ సరన్ జిల్లాలో సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఊరేగింపులో భారత జాతీయ పతాకం మధ్యలో అశోక చక్రం ఉండాల్సిన ప్రాంతంలో పాక్ గుర్తు ఉన్న చంద్రుడు, నక్షత్రం గుర్తు ఉన్న జెండాను ఎగురవేశారు. ఈ ఫోటో, వీడియోను సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రదర్శించారు. దీంతో సోషల్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు రావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఈ చర్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు ప్రయాణించిన వ్యాన్ ను సీజ్ చేశారు.