వీధి వ్యాపారులకు మోదీ గ్యారంటీ

వ్యాపారాలు చిన్నవే కలలు పెద్దవి. ఢిల్లీ మెట్రో కారిడార్ల ప్రారంభంలో ప్రధాని మోదీ

Mar 14, 2024 - 18:45
 0
వీధి వ్యాపారులకు మోదీ గ్యారంటీ

నా తెలంగాణ, ఢిల్లీ: వీధి వ్యాపారులను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని, వారి వ్యాపారాలు చిన్నవే అయినా వారి కలలు పెద్దవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వడ్డీలకు డబ్బులు తీసుకొంటూ వ్యాపారాలు చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను తీర్చేందుకు మోదీ మీ గ్యారంటీ తీసుకున్నారని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించామని ప్రధాని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని జవహర్​ లాల్​ నెహ్రు స్టేడియం వేదికగా ఢిల్లీ మెట్రో రెండు కారిడార్లకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ప్రసంగించారు. అనంతరం సీఎం స్వనిధి కింద లక్ష మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో వీధి వ్యాపారులు ఎన్నో అవమానాలు, అవహేళనలు భరించారని తెలిపారు.బ్యాంకు నుంచి కూడా వారికి రుణాలు అందేవి కాదన్నారు. కరోనా సమయంలో వీధి వ్యాపారుల బలమేమిటో అందరికీ తెలిసొచ్చిందన్నారు. ప్రస్తుతం వారి ఆదాయం గణనీయంగా పెంచడంలో మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇప్పటివరకు 62 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 11వేల కోట్ల రుణాలను అందజేశామన్నారు. తీసుకున్న వారంతా సకాలంలో తిరిగి చెల్లింపులు కూడా చేశారని ప్రధాని వీధి వ్యాపారుల విశ్వసనీయతపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారుల్లో సగం మంది మహిళా వ్యాపారులు కూడా ఉండడం హర్షణీయమన్నారు. వీరందరికి ఇప్పుడు డిజిటలీకరణలో భాగంగా రుణాలు పొందడం సులువైందని పేర్కొన్నారు. తాను కూడా అత్యంత పేదరికం నుంచే ఈ స్థాయికి వచ్చానని నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు ఈతిబాధలు తనకూ తెలుసని ప్రధాని అన్నారు. వారికి చేయూతనిచ్చే అన్ని రకాల చర్యలను తీసుకుంటానని ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.