బై బై బాల గణేశా  రూ. 33,500 పలికిన లడ్డు 

Bye Bye Child Ganesha Rs. 33,500 plasticine laddu

Sep 16, 2024 - 19:14
 0
బై బై బాల గణేశా  రూ. 33,500 పలికిన లడ్డు 


నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని శివాజీ నగర్​ లో భక్తిశ్రద్దలతో వినాయకునికి పూజలు నిర్వహించారు. సోమవారం బాలవినాయకున్ని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. యువతులు, మహిళల కోలాటలు, దాండియా నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఉత్సవ విగ్రహం లడ్డు వేలం పాటలో వేయి రూపాయల నుంచి ప్రారంభించిన వేలంలో రూ 33,500 వరకు కొనసాగింది. నాగరాజు అనే భక్తుడు లడ్డునూ దక్కించుకున్నాడు. ఈ నిమజ్జన కార్యక్రమంలో శివాజీనగర్​ వినాయక మండపం నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, సాయిరెడ్డి, పురోషోత్తం, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.