పీఎంవివైఎస్​ లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఏలేటీ సన్మానం

ప్రధానిని కలవనున్నలక్ష్మి

Sep 16, 2024 - 18:44
 0
పీఎంవివైఎస్​ లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఏలేటీ సన్మానం

నా తెలంగాణ, నిర్మల్: ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద ఎంపికైన లబ్దిదారును నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం సన్మానించారు. నిర్మల్ నియోజకవర్గం దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన మహరాజు లక్ష్మి  ఎంపిక కావటంతో తమ క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ  ఏలేటి మహేశ్వర్ రెడ్డి  లబ్దిదారులను సన్మానించారు. త్వరలో ఈమె ప్రధాని మోదీ ని కలవనున్నారు. తెలంగాణా రాష్ట్రం నుంచి ప్రధానిని కలిసే  అవకాశం ఒకే ఒక లబ్దిదారు లక్ష్మికి దక్కడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.