పాక్​ లో వ్యాన్​ పై దాడి 50 మంది మృతి

50 killed in van attack in Pakistan

Nov 21, 2024 - 17:28
Nov 21, 2024 - 20:26
 0
పాక్​ లో వ్యాన్​ పై దాడి 50 మంది మృతి

ఇస్లామాబాద్​: పాక్​ లోని ఖైబర్​ ఫంఖ్తుక్వాలో ప్రయాణికుల వ్యాన్​ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 32 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కుర్రం ఓచుట్​ కల మండరి సమీపంలో ఈ దాడి జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రయాణికులతో వెళుతున్న ఈ వ్యాన్​ పరాచినార్​ నుంచి పెషావర్​ వెళుతుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. 

పాకిస్థాన్ తహసీల్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి అలీజాయ్ అధికారి డాక్టర్ ఘయోర్ హుస్సేన్ దాడిని ధృవీకరించారు. దాడిని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో దాడికి పాల్పడ్డవారిని వెంటనే పట్టుకోవాలన్నారు.