మాల్దీవుల్లో ఇద్దరు భారతీయులు, ఇజ్రాయెలీ మహిళపై దాడులు

ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన

May 1, 2024 - 18:01
 0
మాల్దీవుల్లో ఇద్దరు భారతీయులు, ఇజ్రాయెలీ మహిళపై దాడులు

నా తెలంగాణ, న్యూఢిల్లీ: మాల్దీవుల్లోనూ మతోన్మాదం పెరిగిపోతోంది. ఇద్దరు భారతీయులు, ఒక ఇజ్రాయెల్​ మహిళపై ఆ దేశంలో దాడులకు పాల్పడ్డారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాజధాని మాలే సమీపంలోని హుల్​ హుమలేలోని సెంట్రల్​ పార్క్​ సమీపంలో కొందరు మాల్దీవులు ఇద్దరు భారతీయులతో కావాలనే వాగ్వాదానికి దిగి దాడి చేశారు. భారతీయులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఘటనలో ఇజ్రాయెల్​ మహిళా టూరిస్ట్​ ను కూడా వేధించి తమ దేశంలోకి అడుగిడవద్దని హెచ్చరించారు. 

మాల్దీవుల్లో మరోమారు మొయిజ్జూ విజయం సాధించాక జరుగుతున్న ఈ దాడులపై పలువురు మాట్లాడుతూ.. ఇస్లామిక్​ రాడికలైజేషన్​ పెరిగిపోతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. కాగా ఈ ఘటనను ఇటు భారత్​, అటు ఇజ్రాయెల్​ లు తీవ్రంగా ఖండించాయి. 

మాల్దీవులు భారత్​ తో పలు విషయాల్లో విభేదిస్తుండగా, మరోవైపు పాలస్తీనాపై ఇజ్రాయెల్​ దాడిని కూడా ఖండిస్తోంది. 
ఇదిలా ఉంటే మాల్దీవులులో తీవ్రవాదం కూడా పెరిగిపోతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కాకుండా పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాలు మాల్దీవుల్లో తిష్టవేసినట్లు సమాచారం. కాగా 2014 నుంచి 15 మధ్య ఇస్లామిక్​ స్టేట్​ కోసం పోరాడేందుకు సుమారుగా 250 మంది మాల్దీవులు వెళ్లారు.