బిట్ కాయిన్ ఫోన్ వాయిస్ వారివే
స్పష్టం చేసిన అజిత్ పవార్
ముంబాయి: బిట్ కాయిన్ ఫోన్ వాయిస్ పటోలే, సుప్రియా సూలేదని అజిత్ పవార్ (ఎన్సీపీ) అన్నారు. వారి యాసను బట్టి తాను ఖచ్చితంగా చెప్పగలనన్నారు. ముంబాయిలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాయుతి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిట్ కాయిన్ కుంభకోణంలో సుప్రియా సూలే, నానా పటోలే లు ఫోన్ లో మాట్లాడుకున్న మాటలు వాస్తవమేనన్నారు. క్రిప్టోకరెన్సీ మోసంలో బిట్ కాయిన్ ద్వారా వచ్చిన నగదును అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోస్తున్నారని పేర్కొన్నారు. బయటపడిన ఆడియోలో ఉన్నది వీరిద్దరి వాయిసేనని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుగుతుందని త్వరలో విషయాలు వెలుగులోకొస్తాయన్నారు.