రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం సంఖ్యాబలం తమకే అనుకూలం
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ర్టపతిపై అవిశ్వాసన తీర్మానంపై సంఖ్యాబలం తమకే అనుకూలంగా ఉందని, చైర్మన్ ను గౌరవించడం విపక్షాలు నేర్చుకోవాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మంగళవారం ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానంపై సంఖ్యాబలం తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కూటమి పనితీరు పక్షపాత్ర ధోరణితో కూడుకున్నదన్నారు. ఇలాంటి పనులు చేయొద్దన్నారు. ఉభయ సభల్లో స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అధికారాన్ని ప్రతిపక్షాలు పదే పదే అగౌరవపరుస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కూటమి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావన్నారు. అసలు సమస్యలను దారి మళ్లించేందుకే ఇలాంటి ప్రయత్నాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. సభను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇది జార్జ్ సోరోస్ లాంటి ప్రయత్నమే అని చురకలంటించారు. ఇలాంటి లేని పోని ఆరోపణలు చేయడం పట్ల కాంగ్రెస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ చైర్మన్ ఎప్పుడు ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగానే పని చేశారన్నారు. 60 మంది ఎంపీలు సంతకాలు చేశారని లేని పోని ఆరోపణలను ఆయన ఖండించారు. చైర్మన్ సూచనలు గౌరవించకుండా దురుసుగా ప్రవర్తించాయన్నారు. సాధారణ నేపథ్యంనుంచ వచ్చిన ధంఖర్ ఎల్లప్పుడూ రైతులు, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశారన్నారు. ఆయన పనితీరుపై తాము పూర్తి సంతోషంగా ఉన్నామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు.