సూపర్​ సోనిక్​ మిస్సైల్​ ప్రయోగం సక్సెస్​

యాంటీ సబ్​ మెరైన్​ లో ఈ క్షిపణి వ్యవస్థ కీలకం

May 1, 2024 - 17:30
 0
సూపర్​ సోనిక్​ మిస్సైల్​ ప్రయోగం సక్సెస్​

బాలాసోర్​: భారత నౌకాదళం మరో సూపర్​ సోనిక్​ మిస్సైల్​ ను ప్రయోగించి విజయం సాధించింది. ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది. బుధవారం ఒడిశాలోని బాలాసోర్​  నుంచి అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో (స్మార్ట్) క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. 

అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి 8.30 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో ఈ క్షిపణి వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ఈ క్షిపణి సుదూర లక్ష్యాలను అవలీలగా నాశనం చేయగలదు. ఈ డబ్బా ఆధారిత క్షిపణి వ్యవస్థ అనేక ఆధునిక ఉప-వ్యవస్థలను కలిగి ఉంది, ఇందులో రెండు-దశల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్, ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ వ్యవస్థ తేలికపాటి టార్పెడోతో పేలోడ్‌గా ఎగురుతుంది. ఇది పారాచూట్ ఆధారిత విడుదల వ్యవస్థను కలిగి ఉంది. పరీక్షలో క్షిపణి వ్యవస్థ నుంచి టార్పెడోను వేరు చేయడం, ఇతర సాంకేతిక అంశాలను డీఆర్డీవో శాస్ర్తవేత్తలు, రక్షణ శాఖ అధికారులు, నేవీ అధికారులు పరిశీలించారు. 

స్మార్ట్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోను అభినందించారు. దీంతో నౌకాదళ సామర్థ్యాలు పెరుగుతాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.