అధ్యక్ష పీఠం ట్రంప్​ దే!

Trump's presidency!

Nov 6, 2024 - 11:35
Nov 6, 2024 - 13:24
 0
అధ్యక్ష పీఠం ట్రంప్​ దే!

267 ఓట్లతో ముందంజ 
హారీస్ లో నిరాశ
224 ఓట్లతో వెనకబడ్డ కమల 
హార్వర్డ్ విజయసభకు గైర్హాజర్ 
ట్రంప్ మద్ధతుదారుల సంబురాలు

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన 267 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. మరోవైపు డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారీస్ 224 ఓట్లతో ట్రంప్ కంటే వెనుకంజలో ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వింగ్‌ల్లో ట్రంప్ అధికారం కొనసాగుతోంది. అరిజోనా, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలో ట్రంప్ విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. నెవడాలో ట్రంప్, హారీస్ మధ్య హోరాహోరీ కొనసాగుతుంది. ఇక్కడి ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. మిచిగాన్‌లో హారీస్ ముందంజలో ఉన్నారు. మొత్తానికి స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించారు. 

మ్యాజిక్ ఫిగర్ 270కి ట్రంప్ కొద్ది దూరంలో ఉన్నారు. అదే సమయంలో కమలా హారీస్ మ్యాజిక్ ఫిగర్ కు భారీ దూరంలో ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో విజయసభ నిర్వహించాలని కమలా హారీస్ భావించారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ ఐదువేలమందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. ఫలితాలు తారుమారై ట్రంప్‌కు అనుకూలంగా మారడంతో ఈ సభకు హారీస్ హాజరు కావడం లేదనే సందేశాన్ని పంపారు. మరోవైపు విజయానికి దగ్గరవుతున్న ట్రంప్ ఫ్లోరిడాలో విజయసభను ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన మద్ధతు దారులు ఇప్పటికే చేరుకొని సంబురాలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ సాధించాక ట్రంప్ వచ్చి ఇక్కడ ప్రసంగిస్తారని రిపబ్లికన్ పార్టీ ప్రారంభించారు. 


మీ హోరాహోరీగా కొనసాగుతున్న త్వరగా ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్‌లు ఒకేసారి నిర్వహించడంతో ఫలితాలు కాస్తనే వెల్లడవుతున్నాయి. అయితే పూర్తి ఫలితాలకు మాత్రం బుధవారం అర్థరాత్రి వరకూ ఎదురు చూపులు తప్పేలా లేవు.