కమలా? ట్రంపా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరా హోరీ

Kamala? Trump? Hora Hora in the US presidential election

Nov 5, 2024 - 19:34
 0
కమలా? ట్రంపా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరా హోరీ
స్వింగ్​ స్టేట్స్​ పైనే అందరి దృష్టి
సర్వేల్లోనూ స్వల్ప తేడాలు
వాషింగ్టన్​ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యాయి. రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​, డెమోక్రటిక్​ పార్టీ అభ్యర్థి కమలా హారీస్​ ల మధ్య హోరాహోరీ కొనసాగుతుంది. 20 రాష్​ర్టాల్లో సాయంత్రం 5.30 గంటలకు ఓటింగ్​ ప్రారంభమైంది. 
 
ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, లూసియానా, మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిచిగాన్, మిస్సౌరీ, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్, సౌత్ కరోలినా, వాషింగ్టన్ డీసీలున్నాయి. జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా వంటి ముఖ్యమైన స్వింగ్ రాష్ట్రాలు ఈ ఎన్నికలలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. స్వింగ్​ రాష్​ర్టాల్లో న్న ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు గెలుపోటముల్లో నిర్ణయాత్మకతమైనవిగా ఉన్నాయి. 
 
నార్త్​ కరోలినాలో ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్​ లో పాల్గొన్నారు. న్యూయార్క్​ లో బ్యాలెట్​ పేపర్​ ద్వారా ఓటింగ్​ జరుగుతుంది.  మరికొన్ని ఓటింగ్​ కేంద్రాలు సెంట్రల్​ టైమ్​ జోన్​ లో ఉండడంతో రాత్రికి అక్కడ ఓటింగ్​ ప్రారంభం కానుంది. 
 
కాగా న్యూ హాంప్​ షైర్​ లోని డిక్స్​ విల్లేనాచ్​ లో ఓటింగ్​ పూర్తయ్యింది. ఇక్కడ కమలా హారీస్​, ట్రంప్​ కు సమానంగా ఓట్లు దక్కాయి. 
 
ఓటింగ్‌కు ముందు కొన్ని సర్వేలు చాలా రాష్ట్రాల్లో పోటీని చూపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ జాతీయంగా మరియు మిచిగాన్, విస్కాన్సిన్ మరియు నెవాడాలో తన ఆధిక్యాన్ని కొనసాగించారు, కానీ పెన్సిల్వేనియాలో ఆమె ఆధిక్యం తగ్గిపోయింది. అరిజోనా, జార్జియా మరియు నార్త్ కరోలినాలో ట్రంప్ ఇంకా ముందంజలో ఉన్నారు.
 
ఎన్నికల సందర్భంగా వైట్​ హౌస్​ భద్రతను భారీగా పెంచారు. భవనం బయట ఇనుప గ్రిల్స్​ ను రక్షణగా ఏర్పాటు చేశారు. నేషనల్​ గార్డ్​ ను మోహరించారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలించేందుకు 50.015 శాతం అవకాశాలుండగా, డొనాల్డ్ ట్రంప్‌నకు 49.985 శాతం అవకాశం ఉందని వెల్లడైంది. అయితే సర్వేలోని శాతాలు గంటగంటకు మారుతున్నాయి. 
 
ఈ ఎన్నికలు అమెరికాకు 47వ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నాయి. ముందస్తు ఎన్నిక సందర్భంగా 8కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 24 కోట్లమంది అర్హులైన ఓటర్లున్నారు. కాగా 2020లో 66 శాతం మాత్రమే పోలింగ్​ నమోదైంది. అమెరికాలోని 50 రాష్​ర్టాల్లో 538 ఎలక్టోరల్​ ఓట్లు ఉండగా, స్వింగ్​ రాష్​ర్టాల్లో 93 సీట్లు ఉన్నాయి. విజయానికి 270 సీట్లు కావాల్సి ఉంటుంది.