సిర్సాలో రూ.4.50 కోట్ల నగదు స్వాధీనం
Rs.4.50 crore cash seized in Sirsa
చండీగఢ్: హరియాణా సిర్సాలో రూ. 4.50 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ విక్రాంత్ భూషణ్ తెలిపారు. అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళి వేళ నియమ నిబంధనల మేరకే నగదును తీసుకువెళ్లవచ్చన్నారు. ఏవైనా వస్తువులు, డబ్బు తీసుకువెళితే అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో కూడిన వివరాలు ఉండాలని తెలిపారు. గత 40 నుంచి రూ. 4,50,71,310 నగదు, బంగారు ఆభరణాలు, డ్రగ్స్, మద్యం, అక్రమ ఆయుధాలు, ఐదు కార్లు, పది ద్విచక్ర వాహనాలు, ఒక ట్రక్కును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
రూ.1 కోటి 12 లక్షల విలువైన 1 కిలో 470 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 28,72,950 విలువైన 17,079 లీటర్ల మద్యం, 5 కిలోల 252 గ్రాముల నల్లమందు, 120 కిలోల 748 గ్రాముల దోడా (గంజాయి), 863 గ్రాముల 337 మిల్లీగ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ. 1,05,82,565 ఉంటుందన్నారు.