ట్రూడో పీఛేముడ్​

ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేవు!

Oct 17, 2024 - 12:43
 0
ట్రూడో పీఛేముడ్​
ఆరోపణలూ ఉత్తివే!
భారత్​ తొలి నుంచీ చెబుతోంది అదే
పక్కా సాక్ష్యాధారాలు అందిస్తే విచారణకు సిద్ధం
ట్రూడో యూటర్న్​ తో మరింత మసకబారిన ప్రతిష్ట
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ‘అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు’ అన్నట్లుగా భారత్​ పై విషం గక్కిన కెనడా ప్రధాని ట్రూడో చావు కబురు చల్లగా చెప్పాడు. భారత్​ కు వ్యతిరేకంగా ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ లేదని (పీఛేముడ్​)! నిఘా వర్గాల సమాచారాన్నే పంచుకున్నాను గానీ, సాక్ష్యాలు లేవన్నాడు. మరీ ట్రూడో ప్రభుత్వం గతం నుంచి గత నాలుగైదు రోజుల నుంచి చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్తివేనా? అంటే అవుననే సమాధానం వస్తుంది. భారత్​ తొలుత నుంచి చెబుతోంది. నిజ్జర్​ హత్యకు సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యాధారాలను సమర్పిస్తే అంతర్జాతీయ వేదికపైనైనా విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అయినా ట్రూడో కేవలం ఇంటలిజెన్స్​ సమాచారంతో భారత్​ పై బురద జల్లెందుకు ప్రయత్నించి చివరకు కెనడాపైనే బురదజల్లుకున్నట్లయ్యింది. ట్రూడో యూటర్న్​ తో ఆయన రాజకీయ ప్రతిష్​ఠ పూర్తిగా మసకబారినట్లవడమే గాక అంతర్జాతీయ సమాజంలో కూడా ట్రూడో పరువు బజారుకెక్కింది. 
 
భారత్​ ఆధారాలు.. ట్రూడోకు ముచ్చెమటలు..
ఖలిస్థానీలపై కెనడా ఆరోపణలు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​ తొలుత నుంచి అంతర్జాతీయ సమాజం, కెనడాకు సమర్పించిన ఆధారాలను గత మూడు నాలుగు రోజులుగా ఒక్కొక్కటిగా బయటపెడుతుండడంతో ట్రూడోకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో ఇక వెనక్కు తగ్గకుంటే తన పరువు పోవడం ఖాయమైని భావించారో ఏమో.. చావు కబురు కల్లగా చెబుతూ.. తన వద్ద ఇంటలిజెన్స్ సమాచారం తప్ప సాక్ష్యాధారాలు లేవని అంతర్జాతీయ సమాజం ముందు ప్రకటించడం కొసమెరుపు.
 
ఉగ్రవాదితో ప్రధాని సమాచార సేకరణా?!
నిజ్జర్​ హత్యపై ఖలిస్థానీ చీఫ్​ గురుపత్వంత్​ సింగ్​ పన్ను నేరుగా ట్రూడోతో మాట్లాడని చెప్పేసరికి అంతర్జాతీయ సమాజం కూడా ఉలిక్కిపడినట్లయ్యింది. మోస్ట్​ వాంటెడ్​ గా ఉన్న వ్యక్తి ఏకంగా కెనడా ప్రధానితో నేరుగా మాట్లాడానని చెప్పడంతో ట్రూడో ఎటూ తప్పించుకోలేక ఇరుక్కుపోయారు. దీంతో వద్దనుకున్నా ఈ ప్రకటన తప్పలేదు. ఏది ఏమైనా ట్రూడో మరోసారి తన పరువు, ప్రతిష్ఠను బజారుకు ఈడ్చుకున్నాడనంలో ఎలాంటి సందేహం లేదు. 
 
ట్రూడో ఈ విషయం ఎక్కడ చెప్పాడు..?
బుధవారం కెనెడియన్​ రాజకీయాల్లో విదేశీ జోక్యానికి సంబంధించి ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని ట్రూడో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హత్యపై భారత్​ ప్రమేయం ఉందని ఐదు దేశాల నుంచి తనకు నిఘా సమాచారం అందిందన్నారు. అదే సమయంలో ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేవని కుండబద్ధలు కొట్టారు. 
 
భారత్​ భగ్గు..
తాము తొలుత నుంచి చెబుతున్నది అదే అని కెనడా నిజ్జన్​ హత్యకు సంబంధించి భారత్​ కు ఖచ్చితమైన ఆధారాలను అందజేయకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్​ జై స్వాల్​ మండిపడ్డారు. కెనడా ప్రధాని ట్రూడో చర్యలు పూర్తి నిర్లక్ష్య వైఖరితో కూడుకొని ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలతో స్పష్టం అవుతుందన్నారు. దీంతో భారత్​–కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిసేందుకు ప్రయత్నించిన ఏకైక బాధ్యత ట్రూడోనే వ్యవహరించాల్సి ఉందని రణధీర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.