ట్రంప్​ దోషి జూలై 11న శిక్ష

ఆరువారాల్లో 22మంది సాక్షుల విచారణ స్టార్మీ డేనియల్​ తో సంబంధాలు డబ్బులు అందించడం నిజమే విరాళాల లెక్కలు తారుమారునకు ప్రయత్నం జైలా? జరిమానా? అన్నదే ఉత్కంఠ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్​ కు పోటీగా రంగంలోకి డోనాల్డ్​ ట్రంప్​

May 31, 2024 - 13:47
 0
ట్రంప్​ దోషి జూలై 11న శిక్ష

న్యూ ఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ను 34 అంశాలలో కోర్టు దోషిగా తేల్చింది. న్యూయార్క్​ కోర్టులో ఆరు వారాలపాటు సాగిన విచారణలో ఆయనను దోషిగా గురువారం తీర్పుచ్చింది. అయితే ఆయనకు శిక్షను జూలై 11న విధించనుంది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి తొలిసారిగా దోషిగా నిర్ధరించింది కోర్టు. ఆరువారాల్లో 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. 12మంది సభ్యులతో కూడిన న్యాయమూర్తుల బృందం ట్రంప్​ ను దోషిగా తేల్చింది. స్టార్మీ డేనియల్​ తో గడిపారని ట్రంప్​ పై ఆరోపణలున్నాయి. వీటిని బయటపెట్టవద్దని ఆమెకు పెద్ద ఎత్తున డబ్బు ముట్టజెప్పారు. పార్టీ కార్యక్రమాలకు వినియోగించే విరాళాల ద్వారా సేకరించిన డబ్బును ఆమెకు అందించినట్లు తేలింది. ఇందుకోసం రికార్డులను కూడా ట్రంప్​ తారుమారు చేశారనే అభియోగాలు నిజమేనని కోర్టు నిర్ధరించింది. 

స్టార్మీ డేనియల్​ ట్రంప్​ తో తనకు సంబంధాలున్నాయని కోర్టులో అంగీకరించారు. త్వరలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆయన శిక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరీ కోర్టు ట్రంప్​ కు జైలు శిక్ష విధిస్తుందా? లేక జరిమానాతో సరిపెడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ జైలుశిక్ష విధిస్తే ఆయన అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాల్సిందేనని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.