భారత్​ కు వంద టన్నుల బంగారం

One hundred tons of gold for India

May 31, 2024 - 14:06
 0
భారత్​ కు వంద టన్నుల బంగారం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వంద టన్నుల బంగారాన్ని ఆర్బీఐ భారత్​ కు తీసుకువచ్చింది. లండన్​​ నుంచి వెనక్కు తీసుకోవడంలో ఆర్బీఐ విశేష కృషి దాగి ఉంది. ఈ విషయాన్ని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. భారత్​ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇందులో 100.3 టన్నుల బంగారం భారత్​ లో ఉండగా, 413.8 టన్నుల బంగారం లండన్​​ లో ఉంది. 308 టన్నుల బంగారాన్ని నోట్ల జారీ కోసం ఆర్బీఐ వద్ద ఉంది. గత కొన్నేళ్లుగా విదేశాల్లో భారత్​ బంగారం నిల్వలు పెరిగిపోతున్నాయి. వీటిని తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. రానున్న సమయంలో మరో వంద టన్నుల బంగారాన్ని భారత్​ కు తీసుకువచ్చేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాలు బంగారం నిల్వలను లండన్​ లో పెడుతుంటాయి. కాగా భారత్​ 2022–23లో 34.3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింద. 2023–24లో 27.7 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. బంగారాన్ని వెనక్కి తీసుకురావడంతో ఆర్థిక భద్రత మరింత బలోపేతం అవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని కొనుగోలు చేస్తున్న దేశాలలో ప్రథమ స్థానంలో భారత్​ ఉండడం గమనార్హం.