ఫడ్నవీస్​ కు పెరిగిన భద్రత

ఇంటలిజెన్స్​ హెచ్చరికలతో అప్రమత్తం

Nov 2, 2024 - 16:23
 0
ఫడ్నవీస్​ కు పెరిగిన భద్రత

ముంబాయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ కు భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే ఆయనకు జడ్​ ప్లస్​ సెక్యూరిటీ అందుతుండగా, ఇంటలిజెన్స్​ హెచ్చరికలతో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమై భద్రతను పెంచింది. శనివారం నాగ్​ పూర్​ విమానాశ్రయానికి ఫడ్నవీస్​ చేరుకోగా ఆయనకు అదనపు భద్రతను కల్పించారు. అలాగే ఇంటివద్ద కూడా భద్రతను పెంచారు. మహారాష్ట్రలో బిష్ణోయ్​ గ్యాంగ్​ పలువురిని బెదిరిస్తుండడం పట్ల కలకలం రేగుతుంది. ఈ గ్యాంగ్​ ద్వారా గతంలో ఫడ్నవీస్​ కు బెదిరింపులు వచ్చాయని ఈ నేపథ్యంలోనే ఇంటలిజెన్స్​ హెచ్చరికలు జారీ చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా దేవేంద్ర ఫడ్నవీస్​ కు భద్రత పెంచడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అవుతుంది. భద్రత కోసం నాగ్‌పూర్ పోలీసుల ఫోర్స్ వన్ అనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రచారంపై ఫడ్నవీస్​ దృష్టి సారించారు.