నీటి సంక్షోభం బీజేపీ ధర్నా
లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టారు బీజేపీ నాయకురాలు బాన్సూరి స్వరాజ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ ప్రభుత్వం కావాలనే కృత్రిమ నీటి కొరతను సృష్టించిందని ఢిల్లీ బీజేపీ నాయకురాలు బాన్సూరి స్వరాజ్ ఆరోపించారు. తీవ్ర నీటి ఎద్దడితో ఢిల్లీ ప్రజల తరఫున స్వరాజ్ శుక్రవారం షాహిదీ పార్క్ నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వరకు నిరసన చేపట్టారు. 2013లో రూ. 600 కోట్ల లాభాల్లో ఉన్న ఢిల్లీ జల్ బోర్డు ప్రస్తుతం రూ. 73 వేల కోట్ల నష్టాల్లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. ఉచిత నీటికి హామీ ఇచ్చి ప్రజలకు నీరందించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారా? అని ప్రశ్నించారు. రెండురోజుల్లో సీఎం జైలుకు వెళతారు. ఆ తరువాత ఈ సమస్యను పట్టించుకునే నాథుడే ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం కూడా ఏర్పడుతుందన్నారు. 7438 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. పక్క ప్రాంతాల నుంచి నీటిని రప్పించుకోలేని చేతకాని ప్రభుత్వం కేజ్రీవాల్ దని మండిపడ్డారు. ఆప్, సీఎంకు వ్యతిరేకంగా పెద్ పెట్టున నినాదాలు చేశారు. చేతిలో బిందెలు, నీళ్ల డబ్బాలతో నిరసన చేపడుతూ బాన్సూరి స్వరాజ్ ప్రభుత్వ చర్యలను తూలనాడారు.