హంటర్ కు రక్షణ జో బైడెన్ పై మండిపడ్డ ట్రంప్
Trump angry at Joe Biden for protecting Hunter
వాషింగ్టన్: తుపాకీ, పన్ను నేరాల నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కొడుకు హంటర్ కు శిక్ష తప్పించాడు. తన అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నిర్ణయంపై డోనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డాడు. హంటర్ కు శిక్ష తప్పించడం జో బైడెన్ తన అధికారాలను దుర్వినియోగం చేయడమేనని సామాజిక మాధ్యమంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. బైడెన్ తన కుమారుడి శిక్షను తప్పించడాన్ని అమెరికన్లు అర్థం చేసుకోవాలన్నారు. లైసెన్సు లేని తుపాకీ కలిగి ఉండడం, అమెరికా చట్టాల ప్రకారం పన్ను చెల్లించకపోవడంపై మండిపడ్డారు. బైడెన్ తన పరిపాలనలో తీసుకున్న ఈ నిర్ణయం తన కుటుంబం పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెబుతుందని అదే సమయంలో అమెరికా న్యాయవ్యవస్థకు భంగం వాటిల్లేలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.