త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ హావా 97 శాతం సీట్లు కమలం వశం

మోదీ పట్ల విశ్వాసాన్ని గెలిపించారన్న కేంద్రమంత్రి అమిత్​ షా అభినందనలు తెలిపిన సీఎం మాణిక్​ సాహా, జేపీ నడ్డా

Aug 14, 2024 - 17:48
 0
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ హావా 97 శాతం సీట్లు కమలం వశం

అగర్తల: త్రిపురలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 97 శాతం సీట్లను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. బుధవారం ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను త్రిపుర ఎన్నికల కమిషనర్​ అసిత్ కుమార్ దాస్ ప్రకటించారు. మంగళవారానికే లెక్కింపు పూర్తయ్యిందన్నారు. మంగళవారం కూడా కొన్ని చోట్ల ఎన్నికలు జరగడంతో ఫలితాలను  బుధవారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

త్రిపుర గ్రామ పంచాయతీలు, పంచాయతీ కమిటీలు, జిల్లా కౌన్సిల్‌లలో 71 శాతం సీట్లను బీజేపీ ఏకపక్షంగా గెలుచుకున్నట్లు తెలిపారు. ఆగస్ట్​ 8న జరిగిన మరికొన్ని స్థానాల ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపొందిందని స్పష్టం చేశారు.

35 పంచాయతీ కమిటీల్లో 34, జిల్లా పరిషత్‌లలో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని కమిషనర్​ వివరించారు. ఎనిమిది జిల్లా పరిషత్‌లలోని 96 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 93 స్థానాల్లో గెలుపు సాధించిందని స్పష్టం చేశారు. 

మొత్తం 1,819 గ్రామ పంచాయతీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 1,476 స్థానాల్లో, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు 148, తిప్ర మోత‌కు 151 విజయం వరించినట్లు స్పష్టం కమిషనర్​ దాస్​ స్పష్టం చేశారు. 

ఈ విజయంపై అమిత్​ షా మాట్లాడుతూ.. ప్రజలకు ప్రధాని మోదీ ప్రభుత్వపై అపారమైన నమ్మకం, విశ్వాసాలు ఉన్నాయని స్పష్టం అవుతోందని తెలిపారు. ఈ విజయం చారిత్రాత్మకమని విజయానికి బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషి అపారమైనదని తెలిపారు.