4న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం
BJP legislative party meeting on 4
5న సీఎం ప్రమాణ స్వీకారం
సీఎంగా తనపేరే ముందన్న షిండే
మోదీ, షా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ప్రకటన
ఆర్థిక, హోంశాఖ మంత్రిత్వ పదవులపైనే పేచీ
ముంబాయి: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపికైనప్పటికీ పేరు ప్రకటనలో జాప్యం నెలకొంటుంది. 4వ తేదీన బుధవారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు సోమవారం మీడియాకు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3వ తేదీనే ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలంతా ముంబాయికి రావాలని ఆదేశించారు. సమావేశంలో శాసనసభా పక్ష నేత ఎన్నిక, ఓటింగ్ జరపనున్నట్లు సమాచారం. మరోవైపు సతారా స్వంత గ్రామం నుంచి తిరిగి వచ్చిన షిండే, సీఎంగా తన పేరు ముందు వరుసలో ఉన్నా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు తీసుకున్న నిర్ణయంపై కట్టుబడి ఉంటానన్నారు. అదే సమయంలో ఆర్థిక, హోంశాఖ లాంటి పెద్ద మంత్రిత్వ శాఖలను కోరుతున్నారు. వీటిపై నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం జరుగుతుంది. 132 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బీజేపీ సీఎంతోపాటు ఇలాంటి పెద్ద మంత్రిత్వ శాఖలను షిండే, పవార్ లకు ఇచ్చేందుకు వెనుకాడుతోంది. వీటికి బదులుగా ఇతర శాఖలను ఇవ్వాలనే దానిపైనే పేచీ నెలకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా 5వ తేదీన గురువారం సీఎం ప్రమాణ స్వీకారం ఖాయమేనని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.