రాముడి కాలంలో దౌత్యవిధానాలే అనుసరిస్తున్నాం

తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు నియమ నిబంధనలు పాటించం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్​

Apr 13, 2024 - 13:41
 0
రాముడి కాలంలో దౌత్యవిధానాలే అనుసరిస్తున్నాం

పూణే: హనుమంతుడు శ్రీలంకలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూనే రాముడికి మద్దతుగా నిలిచాడని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ అన్నారు. ప్రస్తుత భారత్​ ప్రపంచ దేశాలతో అలాంటి దౌత్యవిధానాలనే అనుసరిస్తోందని జయశంకర్​ స్పష్టం చేశారు. తీవ్ర వాదులకు ఎలాంటి నియమ నిబంధనలు ఉండవని వారిని అంతమొందించేందుకు కూడా ఎలాంటి నియమ నిబంధనలను పాటించబోమని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ అన్నారు. మహారాష్ర్టలోని పూణేలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జయ్​ శంకర్​ మాట్లాడారు.

ఉగ్రవాదం ఏ దేశానికైనా ముప్పుతో కూడుకున్నదే అన్నారు. దాన్ని ఉపేక్షిస్తూ కూర్చేంటే భావితరాలను నాశనం చేస్తారని అన్నారు. అలాంటి ఉగ్రవాళి నిర్మూలనకు నియమాలు, నిబంధనలు అని ఉపేక్షించలేమని స్పష్టం చేశారు. భారత్​ కు పొరుగు దేశం పాక్​ అని అందుకు కూడా మనమే కారణమని అన్నారు. 2014 నుంచి  విదేశాంగ విధానంలో మార్పులు తీసుకువచ్చామని జయశంకర్​ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ప్రస్తుత విధానమే సరైనదని అన్నారు.  భారత్​ లో ఉగ్రదాడుల వల్ల అనేకమంది ప్రాణాలను కోల్పోయిందన్నారు.దీనికి పరిష్కారమే ఇప్పటి తమ విధానమన్నారు.