పండిత్​ దీన్​ దయాల్​ కు నివాళులు

బీజేపీ నాయకులు బ్రహ్మం రోగులకు పండ్లు పంపిణీ

Sep 25, 2024 - 20:38
Sep 25, 2024 - 20:42
 0
పండిత్​ దీన్​ దయాల్​ కు నివాళులు
నా తెలంగాణ, ఆందోల్: ప్రతీ ఒక్కరూ పండిత్ దయాల్ ఉపాధ్యాయ అడుగుజాడల్లో నడుచుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు బ్రహ్మం అన్నారు. బుధవారం పండిత్ జయంతి సందర్భంగా ఆయనకు బీజేపీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రోగులకు పండ్లు పంపిణీ చేశారు . అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బ్రహ్మం మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడ్డాడు. మోదీ ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దృఢ సంకల్పంతో ముందుకు వెళుతోంది. పండిత్ స్ఫూర్తితో నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తోంది. దేశాన్ని, నిరుపేదలను ఉన్నతస్థితిలో చూడాలన్నదే బీజేపీ, ప్రధాని మోదీ కల అని అన్నారు.