పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టుశ్రీధర్

Oct 26, 2024 - 17:15
 0
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: రాష్ట్రంలో త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని  హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, తమ ఓటు ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. చివరి తేదీ నవంబరు 6 సమీపిస్తున్నందున పట్టభద్రులు,  ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2021 అక్టోబరు 31వ తేదీ నాటికి డిగ్రీ  పూర్తి చేసినవారు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్​ రూపొందించిన ఫారం 18 పూరించి నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేసిన లేదా ఆన్​ లైన్​ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని మెట్టు శ్రీధర్ తెలిపారు.