గాలి కుంటు టీకాలు తప్పనిసరి

పాడి రైతులకు కలెక్టర్​ వల్లూరు క్రాంతి సూచన

Oct 17, 2024 - 17:34
 0
గాలి కుంటు టీకాలు తప్పనిసరి

నా తెలంగాణ, సంగారెడ్డి: పాడి రైతులు విధిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమం, ఐదో విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్  వల్లూరు క్రాంతి, జిల్లా స్పెషల్ న్యాయాధికారి సునీత రవీందర్ రెడ్డి సంగారెడ్డి లోని వైకుంటపురం గోశాలలో గురువారం  ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధికి పశువైద్య సిబ్బంది అన్ని గ్రామాలలో ముందస్తు సమాచారంతో వెళ్లి టీకాలు వేసి భారత్ పశుదాన్ యాప్ లో వివరాలు పొందుపరచాలని కోరారు. జిల్లాలో తెల్లజాతి పశువులు 99,188 ఉండగా నల్లజాతి పశువులు 11,3,828 మొత్తం  21,3,016 ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14 వరకు జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా వైకుంఠపురం గోశాలలో 145 ఆవులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డా. వసంత కుమారి, వైకుంఠపురం గోశాల నిర్వాహకులు, వరదాచార్యులు, జిల్లా సహాయ సంచాలకులు డా. సి.హెచ్. రవీంద్ర ప్రసాద్, జిల్లా సహాయ సంచాలకులు  డా. రాజేశ్వర్, పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డా. యామిని, డా. అజిత్ చంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.