ట్రాన్స్ లేటర్లకు ఉద్యోగావకాశం
హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయంలో ట్రాన్స్ లేటర్ల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
నా తెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయంలో ట్రాన్స్ లేటర్ల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. రెండేళ్ల కాల వ్యవధితో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్, సీనియర్ ట్రాన్స్ లేటర్(ఇంగ్లీష్ నుంచి తెలుగు), తెలుగు భాషా నిపుణులు, తెలుగు టైపిస్టు ఎంప్యానెల్ మెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయంకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ : http://pib.gov.in/indexed.aspx లో పూర్తి అర్హత వివరాలు ఉన్నాయి. అభ్యర్థులు ఏ విధానంలోనైనా దరఖాస్తులు సమర్పించాలి.
1.https://docs.google.com/forms/d/e/1FAIpQLSf1qY_9Fq b8KEQMdVnBWEXFc1fBNJVBtl J7yBDMZwfO0id5A/viewform?pli=1 (Google formsలో పూర్తి చేయవచ్చు). 2.. http://pib.gov.in/indexed.aspx. 3. పొందుపర్చిన లింక్ https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/A pplicationform(2)GK9T.pdf ద్వారా పీడీఎఫ్ దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకొని పూర్తి చేసి pibhydtranslatorempanel@gmail.com ఈ మెయిల్ ద్వారా గానీ, google forms ద్వారా గానీ 2024 ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల లోగా సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.