ఏడు పదులు దాటినా... ఎవర్ గ్రీన్ ఎనర్జీ

విమర్శించిన నోళ్లే మోదీ కటాక్షం కోసం ఎదురుచూస్తున్నయి

Feb 15, 2024 - 14:23
 0
ఏడు పదులు దాటినా... ఎవర్ గ్రీన్ ఎనర్జీ


నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రత్యర్థుల నుంచి అంతులేని విమర్శలు.. అయినా..దేశం కోసం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రజలకు మేలు చేస్తుందనుకున్న నిర్ణయాల అమలులో వెనుకడుగు వేయలేదు నరేంద్ర మోదీ. ఈ వైఖరే... ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. శక్తిమంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల నేతగా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. మరోమారు అధికారం వశమయ్యేందుకు కారణమౌతోంది..నరేంద్ర మోదీ... భారత రాజకీయాల్లో ఓ ప్రభంజనం. అనతి కాలంలోనే భారత్​ తో పాటు ప్రపంచంలోనూ బలమైన నేతగా పేరుగాంచారు.  అయితే వయసు రీత్యా ఏడుపదులు దాటిన ప్రస్తుత రాజకీయ నేతలందరికన్నా ప్రజాదరణలో ముందంజలో ఉన్నారు.

కీలక నేతలంతా 70 ప్లస్...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేరళ సీఎం  పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉంటారు. వీరందరిలో కామన్ పాయింట్ వీరంతా 70ప్లస్ వయసులో ఉన్న వారు. ఇదంతా చూస్తే దేశాన్ని నడిపిస్తున్న నాయకత్వాల్లో కీలక భూమిక పోషిస్తున్న వారంతా సెవన్టీ ప్లస్ వారే అన్న విషయం అర్థమవుతుంది. ఇక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతలు సైతం డెబ్బైయ్యో పడికి దగ్గరలో ఉన్నరు.

తిరుగులేని ఆధిక్యం

 ఇప్పుడు ప్రస్తావించిన వారిలో బలంగా.. అత్యంత శక్తి సామర్థ్యాలతో.. తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్నది ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. మిగిలిన వారు వారికి ఉన్న పరిధిలో మాత్రమే వ్యవహరిస్తున్నారు. కానీ.. మోదీ అలా కాదు. ఆయన యువకుడిలా దూసుకెళుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఎదురొడ్డే నాయకుడే లేడని చెప్పటం అతిశయోక్తి కాదు. దేశం మొత్తంలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఆయనకున్న జనాదరణలో ఆయన స్థాయికి దగ్గరలో ఎవరూ లేరు.

రాహుల్ లో కొరవడిన ఉత్సాహం

 సాధారణంగా సెవన్టీ ప్లస్ తర్వాత వయోభారం అన్న పదాన్ని వాడటం కామన్. కానీ.. మోదీ విషయంలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. వయసు విషయంలో మోదీతో పోలిస్తే రాహుల్ గాంధీ చాలా చిన్న వయస్కుడే. కానీ.. మోదీకి ధీటుగా ఎదగలేకపోవటం రాహుల్ ను ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికి దేశ రాజకీయాల్ని.. దేశ ప్రజల మనోభావాల్ని.. వారి ఆశల్ని.. ఆశయాల్ని గుర్తించే విషయంలో రాహుల్ వెనుకబడే ఉన్నారని చెప్పాలి. దీంతో.. మిగిలిన వారికి భిన్నంగా మోదీ దూసుకెళుతున్నారు.

అంతా మోదీ దారికి వస్తున్నారు

ఆయన తోటి వయసున్న వారు మాత్రమే కాదు.. ఆయనకంటే ఇరవైఏళ్లు చిన్నోళ్లు సైతం ఆయన్ను.. ఆయన వేగాన్ని అందిపుచ్చుకోలేని విచిత్ర పరిస్థితి భారత రాజకీయాల్లో నెలకొంది. ఎవరైనా ఒకరిద్దరు ఒకరిద్దరు మోదీని విభేదించాలని చూసినా దేశం పట్ల, ప్రజల పట్ల మోదీకున్న చిత్తశుద్ధి ముందు వారు వెనక్కి తగ్గక తప్పడం లేదు.  ఆయన్ను ఎదుర్కొనే తలనొప్పి వ్యవహారం ఎందుకు? సర్దుకుపోతే సరిపోలా? అన్నట్లుగా మారింది. రాజకీయంగా మోదీని తప్పనిసరిగా విభేదించాలన్న వారికి మిగతా పక్షాల నుంచి సహకారం అందక ఉనికి కోల్పోతున్న సందర్భాలూ ఉన్నాయి. స్థానికంగా లబ్ధిపొందాలనే ఉద్దేశంతో మోదీని ఢీకొనాలనుకున్న తెలుగుదేశం.. బీఆర్ఎస్ పార్టీల అధినేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శరద్ పవార్ కు సొంత పార్టీ కూడా మిగలకుండా పోయింది. మోదీ కంటే వయసులో చిన్న వాడైన ఉద్దవ్ ఠాక్రే లాంటోళ్లు పునరాలోచన చేస్తున్నారు. రెండు నెలల్లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ప్రసన్నం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయపార్టీలు పడిగాపులు పడుతున్నాయి.