యూపీలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా.. 24మంది మృతి
మృతుల్లో మహిళలు, చిన్నారులు
లక్నో: యూపీలోని కాస్ గంజ్ లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. చెరువులో ట్రాక్టర్ బోల్తా పడడంతో 24మంది మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలున్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గంగాస్నానం కోసం ఇక్కడకు వస్తుంటారు. ట్రాక్టర్ లో వస్తుండగా అదుపుతప్పి గట్టు ఒడ్డు నుంచి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ చెరువులో పడింది. స్థానికులు విషయం తెలుసుకొని హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే ఆలస్యం జరిగింది. 24మంది మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సహాయక చర్యల్లో వేగం పెంచారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.