ఐదోసారి పుతిన్​ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ

శత్రుదేశాలతో బంధాలు బలోపేతం దిశగా చర్యలు ఆహ్వానాన్ని బహిష్కరించిన అమెరికా, బ్రిటన్​ దేశాలు

May 7, 2024 - 16:46
 0
ఐదోసారి పుతిన్​ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్​ ప్రమాణ స్వీకారం చేశారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం మాస్కోలోని గ్రాండ్​ క్రెమిన్​ ప్యాలెస్​ లో జరిగింది. 

ఈ సందర్భంగా పుతిన్​ మాట్లాడుతూ.. మేం మరింత బలపడతాం. శత్రువులుగా భావించే దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తాం. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను చేయగలిగినదంతా చేస్తానని అన్నారు. 

కాగా రష్యాలో జరిగే పుతిన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అమెరికా, బ్రిటన్ తోపాటు పలు యూరప్ దేశాలు బహిష్కరించాయి. 2000 సంవత్సరంలో తొలిసారిగా పుతిన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2004, 2012, 2018లో కూడా రాష్ట్రపతి అయ్యారు.

రష్యాలో అభివృద్ధిని ఆపడానికి పాశ్చాత్య దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఏళ్ల తరబడి తమ దేశంపై పలు దేశాలు దూకుడు వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఐరోపా, ఆసియాలోని మా మిత్రదేశాలతో కలిసి మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ కోసం మేము పని చేస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. అన్ని దేశాలు ఒకే భద్రతా వ్యవస్థను కలిగి ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం, ఐక్యతను కాపాడుకోవడానికి, రష్యా సామాజిక-రాజకీయ వ్యవస్థ అనువైనదిగా ఉంటుందన్నారు. ఎలాంటి సవాలుకైనా, ఆపదకైనా తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని పుతిన్​ ప్రకటించాలి.