నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహారాష్ట్ర, ఝార్‌ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. మంగళవారం న్యూ ఢిల్లీలోని ఈసీ ప్రధాన ఎన్నికల ప్రధానాధికారిక రాజీవ్ కుమార్ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు.
మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ నిర్వహించి ఫలితాలు నవంబర్ 23న ప్రకటించనున్నారు. రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో 22వ తేదీ నోటిఫికేషన్ విడుదల, 29అక్టోబర్ నామినేషన్లకు చివరి తేదీ, పరిశీలన 30, 4 నవంబర్ నామినేషన్ల ఉపసంహరణ, 20 నవంబర్ ఎన్నికల నిర్వహణ, 23 నవంబర్ ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల.
మహారాష్ట్రలో 9. 63 కోట్ల మంది ఓటర్లు ఉంటారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కో బూత్‌లో దాదాపు 960 మంది ఓటర్లు ఉన్నారు. ముంబైలో పోలింగ్ బూత్‌లను పెంచామన్నారు. 4.97 కోట్ల మంది పురుష ఓటర్లు. మహిళా ఓటర్ల సంఖ్య 4.66 కోట్లు. యువ ఓటర్ల గురించి చెప్పాలంటే వారి సంఖ్య 1.85 కోట్లు. మొదటి సారి ఓటువేస్తున్న వారి సంఖ్య 20.93 లక్షలు. మహారాష్ట్రలో మొత్తం 5 వేల 789 చోట్ల లక్షా 186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో 42, 604, గ్రామీణ ప్రాంతాలు 57,582 ఉన్నాయి. ఒక పోలింగ్ స్టేషన్‌లో సగటున 960 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జార్ఖండ్..
జార్ఖండ్‌లో 2.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ చెప్పారు. ఇక్కడ 1 కోటి 31 లక్షల మంది పురుష ఓటర్లు ఉండగా, 1 కోటి 29 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్‌లోని 29, 562 బూత్‌లలో ఓటింగ్ నిర్వహించబడింది. ప్రతి బూత్‌లో 881 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. యువ ఓటర్లు 66.84 లక్షలు. మొదటి సారి ఓటు వేస్తున్న వారి సంఖ్య 11.84 లక్షలు కాగా, వికలాంగ ఓటర్లు 3.67 లక్షలు. అలాగే ఇక్కడ థర్డ్ జెండర్ ఓటర్లు 448 మంది ఉన్నారు. వీరితో పాటు 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 1706 మంది, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 1.14 లక్షల మంది ఉన్నారు.
తొలివిడత..
జార్ఖండ్‌లో 18 నుంచి 25 అక్టోబర్ నామినేషన్ల స్వీకరణ, 28 పరిశీలన, 30న పేర్ల ఉపసంహరణ, 13 నవంబర్ ఎన్నికల నిర్వహణ, 23 నవంబర్ ఓట్ల లెక్కింపు.
రెండో విడత..
22 నుంచి 29 నామినేషన్ల స్వీకరణ, 30 నామినేషన్ల పరిశీలన, 1 నవంబర్ పేర్ల ఉపసంహరణ, 20 నవంబర్ ఎన్నికల నిర్వహణ, 23 నవంబర్ ఓట్ల లెక్కింపు.
ఉప ఎన్నికలు..
14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు లోక్ సభ ఉప ఎన్నికలను కూడా కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 13న ఎన్నికలు నిర్వహించనుండగా 23న ఫలితాలు వెల్లడించనున్నారు.
యూపీలో 9, రాజస్థాన్ 7, పశ్చిమ బెంగాల్ 6, అసోం 5, బిహార్ 4, పంజాబ్ 4, కర్ణాటక, కేరళ 2, మధ్య ప్రదేశ్ 2, సిక్కిం 2, గుజరాత్ 1, ఉత్తరాఖండ్ 1, ఛత్తీస్ గ 1 , మేఘాలయ 1 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కేరళలోని వయోనాడ్, మహారాష్ర్టలోని నాందేడ్ లోక్ సభ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది.
ఎన్నికలు ప్రకటించని స్థానాలు..
యూపీలోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించలేదు. కేరళలోని దేవికులం అసెంబ్లీ కూడా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఇ. రాజా అనర్హత కేసు కోర్టులో ఉన్నందున ఈ స్థానంలో ఎన్నికలను ప్రకటించలేదు. పశ్చిమ బెంగాల్ బసిర్ హాట్ స్థానం ఎంపీ మరణంతో ఈ స్థానం కూడా ఖాళీగా ఉంది. ఈ స్థానంలో ఎన్నికలను కూడా ఈసీ ప్రకటించలేదు.