రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి, ఒకరికి గాయాలు
రాజస్థాన్ ఝలావర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.
జైపూర్: రాజస్థాన్ ఝలావర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి బృందం మారుతీ వ్యాన్ ను ట్రాలీ ఢీ కొట్టింది. వ్యాన్ రెక్కలు ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్ లోని దుంగ్రీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి దుగర్ గావ్ లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా అక్లెరా పోలీస్స్టేషన్ పరిధి ఎన్హెచ్–52లోని పచోలా సమీపంలో మారుతీ వ్యాన్ ను ట్రాలీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా బీతావహంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 9మంది మృతి చెందగా, ఒకరికి గాయాలైనట్లు అక్లెరా పోలీస్ స్టేషన్ అధికారి బిష్ణోయ్ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతులంతా 35యేళ్ల వారేనని అన్నారు.