వినాయక నిమజ్జనాలకు పటిష్ట భద్రత

  సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ 

Sep 11, 2024 - 20:36
 0
వినాయక నిమజ్జనాలకు పటిష్ట భద్రత

నా తెలంగాణ, సంగారెడ్డి: వినాయక నిమజ్జనాలకు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. వినాయక నిమజ్జనాల దృష్ట్యా చెరువులు, కుంటల వద్ద భద్రత ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి  ఉత్సవాలలో కీలక ఘట్టం నిమజ్జనం అన్నారు. పఠాన్ చెర్వు, అమీన్ పూర్, బొల్లారం పోలీసు స్టేషన్ల పరిధిలో గల చెరువులు, కుంటలలో వినాయక నిమజ్జనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా సమన్వయంతో నిమజ్జనాలను శాంతియుతంగా పూర్తి చేయాలని ఎస్పీ రూపేష్​ తెలిపారు. ఈ సందర్శనలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావు, పఠాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి,  ఇన్స్​ పెక్టర్​ ప్రవీణ్ రెడ్డి, అమీన్ పూర్ ఇన్స్​ పెక్టర్​ సదా నాగరాజు తదితరులు ఉన్నారు.