మహిళా ఉద్యోగుల భద్రతకే షీ -షట్లర్

  వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ

Oct 16, 2024 - 20:45
 0
మహిళా ఉద్యోగుల భద్రతకే షీ -షట్లర్

నా తెలంగాణ, సంగారెడ్డి: మహిళా ఉద్యోగుల భద్రతకే షీ -షట్లర్ బస్సును ప్రారభించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో ఎస్ ఎస్ ఎస్ సీ, గ్రాండ్ ఫార్మ సహకారంతో బుధవారం వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ “సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్”, గ్లాండ్ ఫార్మా ఆధ్వర్యంలో జిల్లాలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, అత్యవసర సమయంలో త్వరితగతిన స్పందించడానికి అధునాతన సాంకేతికత కలిగిన పది ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్ లు అందుబాటులో ఉంటాయన్నారు. ట్రాఫిక్ ని నియంత్రించేందుకు  సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్”, గ్లాండ్ ఫార్మాలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస్ట్ రఘురమణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎస్ ఎస్ ఎస్ సీ ట్రెజరర్ రమణారెడ్డి, మెంబర్స్ ఆనంద్ రావ్, రమేష్, ఎ.వి. రావ్, రంజిత్ కిరణ్ ట్రాఫిక్ ఇన్స్​ పెక్టర్​ సుమన్, లాలూ నాయక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.