నవ భారత్ నిర్మాణంలో యువత సేవలు వినియోగించుకోవాలి
కేంద్రమంత్రి మన్సూఖ్ మాండవీయా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నవ భారత్ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు ఎంవై ఫ్లాట్ ఫామ్ ను ఏర్పర్చనున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయా అన్నారు. న్యూ ఢిల్లీలోని ఆయన కార్యాలయం నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన యువజన శాఖల మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
విజన్ సాకారానికి అన్ని రాష్ర్టాలు కలిసి పనిచేయాలన్నారు. ఎంవై ద్వారా యువత భాగస్వామ్యం మరింత పెంచాలన్నారు. యువతలో స్ఫూర్తిని పెంచే సేవా సే సీఖే (సేవ చేస్తూ నేర్చుకోవడం)ను రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువత ఆసుపత్రులు, రోగుల సహాయాన్ని అందించడంలో భాగస్వాములను చేయాలన్నారు. దేశంలో కొనసాగుతున్న అన్ని రకాల కార్యక్రమల్లో యువత సేవలను విరివిగా వినియోగించుకుంచుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. స్వచ్ఛభారత లో కూడా యువతను భాగస్వామ్యం చేయాలని మాండవీయా రాష్ర్టాలకు సూచించారు.