గణనాథునికి ప్రత్యేక పూజలు

Special Pujas to Lord Ganesh

Sep 11, 2024 - 20:40
 0
గణనాథునికి ప్రత్యేక పూజలు

నా తెలంగాణ, మెదక్​: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం మెదక్ జిల్లా మండల పరిధిలోని మంబోజి పల్లి శివాజీ గణేష్ మండలి వద్ద మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్  పట్టణంలో గల్లి గల్లిలో గణేశుని నామస్మరణలతో మారుమ్రోగిపోయాయి. మెదక్ పట్టణంలోని జమ్మికుంటలోని సూర్య గణేష్ మండలి వద్ద రాజు సంగమేష్ ఆధ్వర్యంలో 6 గంటల నుంచి రెండు గంటల వరకు హోమం,  ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మెదక్ పట్టణంలోని రాందాస్  చౌరస్తా,  ఆటోనగర్, అజంపుర, న్యూ మార్కెట్ చమన్, వీర హనుమాన్ కాలనీలలో ఘనంగా గణనాథునికి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.