ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ 

Collector who unexpectedly inspected the school

Oct 24, 2024 - 20:48
 0
ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ 

నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధన కోసం ఇప్పటి నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యార్థులను ప్రతిభా ఆధారంగా గ్రూపులుగా విభజించి వారి సామర్థ్యాలు పెంపొందించడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.