ముచ్చటగా మూడోవిడత రుణమాఫీ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 846.41 కోట్లు విడుదల రైతు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం మూడో విడత రూ. 846.41 కోట్లు విడుదల.... ఇప్పటి వరకు రైతులకు రూ.2,111.89 కోట్లు ఆనందం వ్యక్తం చేస్తున్న కర్షకలోకం

Aug 16, 2024 - 17:14
 0
ముచ్చటగా మూడోవిడత రుణమాఫీ

నా తెలంగాణ, ఆదిలాబాద్​: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగానే కర్షకుల కష్టాలు తీరేలా మూడో విడత రుణమాఫీ సైతం పూర్తి చేసింది. రుణ మాఫీ ప్రక్రియలో భాగంగా రూ.2 లక్షల వరకు ఉన్న రుణాల కు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత రూ. 846.41 కోట్లు విడుదలయ్యాయి. మూడు విడతలు కలిపి రైతులకు రూ.2,111.89 కోట్లు రుణాన్ని మాఫీ చేసింది. 

ఆదిలాబాద్ జిల్లాలో 17,294 మందికి, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 9,578 మందికి, మంచిర్యాల జిల్లాలో 10,611 మందికి, నిర్మల్ జిల్లాలో 13,579 మంది కుటుం బాలకు రుణమాఫీ చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలకు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత రూ. రూ.846.41 కోట్లు విడుదల య్యాయి. మూడు విడతలు కలిపి రైతులకు రూ. 2,111.89 కోట్లు రుణాన్ని మాఫీ చేసింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగానే కర్షకుల కష్టాలు తీరేలా మూడో విడత రుణమాఫీ సైతం పూర్తి చేసింది. రేవంత్​ రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రుణ మాఫీ ప్రకటించడమే కాకుండా రైతులకు చెక్కులు అందించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబె ట్టుకోవడంతో అన్నదాతలు ఆనందంలో మునిగి తేలా రు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అన్నమాట ప్రకారం రుణమాఫీ కావడంతో తమది రైతు ప్రభుత్వమని చెబుతున్నారు.

రూ. 2,111.89

మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ. 846.41 కోట్లు విడుదల అయ్యాయి. అదిలాబాద్ జిల్లాలో 19,493 ఖాతాలకు గాను 17,294 మంది కుటుంబాలకు లబ్ది చేకూరింది. ఈ జిల్లాకు సంబంధించి రూ. 286.26 కోట్లు రుణమాఫీ కింద విడుదల  చేశారు. ఇక, కొమురం బీమ్​ ఆసిఫాబాద్ జిల్లాలో 11,933 ఖాతాలకు 9,578 కుటుంబాలకు రుణమాఫీ చేశారు. ఈ జిల్లాకు రూ.157.21 కోట్లు విడుదల చేశారు. మంచిర్యాల జిల్లాలో 13,155 ఖాతాలకు గాను 10,611 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ఈ మేరకు 175.44 కోట్లను రుణమాఫీ కింద అందించారు. నిర్మల్ జిల్లాలో 16,835 ఖాతాలు ఉండగా, 13,579 మంది కుటుంబాలకు 227.50 కోట్లు రుణమాఫీ చేశారు. మూడు విడతల్లో ఇప్పటి వరకు రైతులకు రూ.2.111.89 కోట్లు రుణ మాఫీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రూ. 2 లక్షల పైనున్న అప్పులు తర్వాత.. 

మూడు విడతల్లో రుణమాఫీ పొందని అర్హులైన రైతుల నుంచి గ్రీవెన్సులు స్వీకరిస్తున్నారు. సాంకేతిక సమస్య లను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రేషన్ కార్డులు లేకుండా, రుణమాఫీ పథకంలో అర్హత పొం దిన రైతులు కూడా ఉన్నారు. పంద్రాగస్టు తర్వాత ఈ కేటగిరీలో ఉన్న రైతులపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉండగా రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు కూడా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.2 లక్షలకు పైనున్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే.. మిగిలిన రూ.2 లక్షలను మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

స్పెషల్ డ్రైవ్..

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేసింది. మూడు విడతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది. అయితే కొందరు రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు.  సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆధార్, పాస్ బుక్ లలో పేర్లు మార్పులు, కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు కారణాలతో పలువురికి రుణమాఫీ కాలేదని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతులు ఆందోళనకు గురికావొద్దని, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని తెలిపారు.