కేదార్ నాథ్ యాత్ర మార్గం పునరుద్ధరణ
కాలినడకన 200మంది దర్శనానికి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ థామ్ యాత్ర 15 రోజుల తరువాత శుక్రవారం తిరిగి ప్రారంభమైంది. జూలై 31న కురిసిన భారీ వర్షాలతో 29 చోట్ల భారీ యెత్తున కొండచరియలు విరిగిపడడంతో యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. కేదార్ నాథ్ ను ఇప్పటివరకు 10,93,632మంది భక్తులు సందర్శించుకున్నారు. శుక్రవారం రెండువందల మంది యూపీ, గుజరాత్, హరియాణా నుంచి యాత్రికులు యాత్ర కోసం బయలుదేరినట్లు ఆలయ ట్రస్టు వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాలినడకనే యాత్రికులను అనుమతిస్తున్నారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని ప్రత్యేక బృందం శిథిలాలను తొలగించే పనిని చేపట్టింది. కొండచరియలను తొలగించే పనిని 260 మంది ప్రత్యేక బృందం చేపట్టింది. రాకపోకలకు మార్గం సుగమం చేసింది.