సాంస్కృతిక సారథి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక 

Election of District Working Committee of Cultural Sarthi Welfare Association

Aug 16, 2024 - 17:20
 0
సాంస్కృతిక సారథి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక 

నా తెలంగాణ, సంగారెడ్డి: తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారులు తమ సంస్థ సంక్షేమం కొరకు, తమ హక్కుల సాధన కొరకు శుక్రవారం సంగారెడ్డి సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాంస్కృతిక సారథి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా అయిదాల సునీల్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము శేఖర్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా డి రమేష్, దరావత్ రాజు, గౌరవ సలహాదారులుగా నీరుడి దుర్గేశ్, చామంతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మామిడి సాయిలు, పటేల్ సంద్య, కోశాధికారిగా భామిని నవీన్, అసోసియేట్ అధ్యక్షులుగా మదన్ సింగ్, ప్రచార కార్యదర్శిగా నెనావత్ రవీందర్,  కార్యవర్గ సభ్యులుగా ఏర్పుల వినేష్, గౌని శంకర్, నల్లనాగుల శశిప్రియలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా కమిటీ ఏర్పాటు అనంతరం ఎన్నికైన జిల్లా అధ్యక్షులు అయిదాల సునీల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రపోషించి రాష్ట్ర సాధనలో ప్రధాన భాగస్వామ్యమైన ఉద్యమ కళాకారులు ఈ సాంస్కృతిక సారథి కళాకారులు. గత పది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక అంశాలు, గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవగాహన అంశాలపై ఆట-పాట-మాట, కళాప్రదర్షనల ద్వారా పట్టణ వీధులు, గ్రామాల్లో, తండాల్లో ప్రజలను చైతన్యం కల్పిస్తున్నామన్నారు. కళాప్రేమికులు, ఉద్యమకళాకారుల శ్రేయోభిలాషి  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో కొంత జీతాలు పెంపు, కళాకారులకు జీతాలు సక్రమంగా వెయ్యడం కళాకారుల్లో చాలా సంతోషాన్ని నింపిందని చెప్పారు. ప్రజాపాలనపై డప్పు దరువులతో ప్రజలను చైతన్యం చేస్తూనే సారథి కళాకారులకు ఉద్యోగ భద్రత, గృహాలు, ఆరోగ్య బీమా ఇతర సంక్షేమం కొరకు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఆయన తెలిపారు.