మహిళా సాధికారతే లక్ష్యం

జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​

Sep 25, 2024 - 21:23
 0
మహిళా సాధికారతే లక్ష్యం
నా తెలంగాణ, మెదక్​: మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా సమైక్య ప్రగతి పథంలో ముందుకు పోవడం శుభపరిణామమని మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. బుధవారం జిల్లాలోని తెలంగాణ భవన్ లో మహిళా సంఘాల ఏడో వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్​ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జిల్లాలో13,063  మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయని తెలిపారు. 2024–-25 సంవత్సరంలో రూ. 214 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు వంద శాతం అక్షరాస్యత సాధించాలన్నారు.   మహిళల ఆర్థిక స్వావలంభనే లక్ష్యంగా ముందుకువెళ్లాలని తెలిపారు. బాల్య వివాహాలు, వరకట్న నిషేధంపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. తీసుకున్న రుణాలు వినియోగ అవసరాలకు వాడకుండా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వివోల ద్వారా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. 
 
ఈ సమావేశంలో 2023–-24 వార్షిక నివేదిక,2024–25 ప్రణాళికలకు ఆమోదం లభించిందని రాహుల్​ రాజ్​ వివరించారు. గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన తూప్రాన్​, మనోహరాబాద్​, చేగుంట, నర్సాపూర్, హవేలీ ఘనపూర్, మెదక్ మండలాల అధ్యక్షురాళ్లు, సంబంధిత ఏపీఎంలను కలెక్టర్​ శాలువాతో సన్మానించి, మెమోంటోలు అందించారు. 
 
ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సిఎచ్ శ్రీనివాస్ రావు, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. సరస్వతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నవనీత, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు మండల సమాఖ్యల పదాధికారులు, జిల్లా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.