ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకోవాలి
అర్హులకు కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపు
నా తెలంగాణ, మెదక్: పట్టభద్రులు, శాసనమండలి ఎన్నికకు ఓటరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదుపై ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం సంబంధించి అర్హత కలిగిన జిల్లాలోని తాసిల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. తాసిల్దార్ కార్యాలయాల్లో ఓటరు నమోదు ఫారాలు ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. పూరించిన దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో అందచేయాలని సూచించారు. నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.