అలవికాని ఉచిత హామీలు
విద్యుత్ శాఖపై మోయలేని భారం
పార్టీల హామీలు రాష్ర్ట పురోగతికి ఆటంకాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటే మంచిదంటున్న నిపుణులు
కశ్మీర్: జమ్మూకశ్మీర్ లో అలవికాని ఉచిత హామీలతో ఎన్సీ, పీడీపీ, అప్నీ పార్టీలు ఓట్లకు గాలమేస్తున్నాయి. ఈ హామీలతో రాష్ర్ట ఖజానాపై భారీ భారం పడతుందని దీంతో జమ్మూకశ్మీర్ ఆర్థికంగా వెనుకబాటుకు గురికాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ప్రజలు ఉచిత హామీల వైపు మొగ్గుచూపుతారా? అభివృద్ధి వైపు పయనిస్తారా? అన్నది త్వరలో తెలుతుంది.
ఆయా పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్లో 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని ప్రకటించాయి. జమ్మూ కాశ్మీర్ విద్యుత్ ధర 99 యూనిట్ల వరకు రూ. 1.20 పైసలు, 100-199 యూనిట్లు రూ. 1 రూ 1.90, 200 యూనిట్ల పైన రూ. 4. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే పార్టీలు ఇచ్చిన హామీ మేరకు ప్రతీయేటా రూ. 5 నుంచి 6వేల కోట్ల నష్టం తప్పదు.
ఇప్పటికే జమ్మూకశ్మీర్ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయే తప్పరాష్ర్టంలో ఆర్థిక పరిస్థితులు ఏం ఆశాజనకంగా లేవన్నది నిపుణుల వాదన. ఇప్పుడిప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ఆర్థిక ఎదుగుదలకు మార్గం సుగమం అవుతుంది. ఇవే చర్యలు మరో ఐదేళ్లపాటైనా కొనసాగితే రాష్ర్ట భవిష్యత్ ఆర్థికంగా బలపడుతుంది. అటు పిమ్మట ఉచితాలకు వెళ్లినా పెద్దగా నష్టం అనిపించదు. కానీ ప్రస్తుతం ఆర్థిక సత్ఫలితాలు అందిందేకు సమయం పట్టనున్న సందర్భంలో ఉచితాలు రాష్ర్టానికి నష్టదాయకమేనంటున్నారు.
పంజాబ్, ఢిల్లీ, తెలంగాణలో ఉచిత హామీలతో పలు ప్రభుత్వ సంస్థలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. మరోవైపు ఈ భర్తీని ఎలా పూడ్చుకోవాలో తెలియక దిక్కుతోచక అప్పులకై చేయి చాచుతున్నాయి.
ఏది ఏమైనా ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ర్టంలో ఉచితాలతో అసలుకే ఎసరొచ్చే అవకాశం లేకపోలేదు. ప్రజలు ఆ దిశగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని అభివృద్ధి పార్టీలకే ఓటేస్తే మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.