చాయ్​ వాలా విధానంపై ఆశ్చర్యం

Surprised at the Chai Wala policy

Aug 30, 2024 - 13:26
 0
చాయ్​ వాలా విధానంపై ఆశ్చర్యం
  • యూపీఐ చెల్లింపులు, 24 గంటల బ్యాంకింగ్​ సేవలు
  • 94 కోట్లకు బ్రాడ్​ బ్యాండ్​ వినియోగదారులు
  • 29 కోట్ల మహిళల జన్​ ధన్​ ఖాతాలు
  • ఫిన్​ టెక్​ ఫెస్ట్​ 2024లో ప్రధాని మోదీ
ముంబాయి: ప్రపంచం భారత్​ ఫిన్​ టెక్​ వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్య పోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకప్పుడు చాయ్​ వాలా దేశాన్ని సాంకేతికత వైపు నడిపించగలరా? అని ప్రశ్నించారని అన్నారు. కానీ నేడు భారత్​ ను సందర్శించేందుకు వచ్చిన వారు ఇక్కడి విధానంపై ఆశ్చర్యపోతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్​ యూపీఐ ద్వారా చెల్లింపులను చేయడం, ఆహ్వానించడంలో ముందుందని ప్రధాని తెలిపారు. 
 
శుక్రవారం ముంబాయిలోని జియో వరల్డ్​ కన్వెన్షన్​ సెంటర్​ లో జరిగిన గ్లోబల్​ ఫిన్​ టెక్​ ఫెస్ట్​–2024లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత్​ లో శాస్ర్త, సాంకేతిక, ఆర్థిక శాఖలు బలోపేతం లేవని ఒకప్పుడు అనుకునేవారు. కానీ తమ పదేళ్ల పాలనలో దేశంలో బ్రాడ్​ బ్యాండ్​ వినియోగదారులు 60 మిలియన్ల నుంచి 940 మిలియన్లకు (94కోట్లు) చేరుకున్నారని తెలిపారు. దేశంలో తీసుకువస్తున్న నూతన విప్లవం వల్ల ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తున్నామన్నారు. దీంతో అద్భుతాలు సృష్టించగలుగుతున్నామని మోదీ తెలిపారు. 
 
ప్రస్తుతం బ్యాంకింగ్​ సేవలు 24 గంటలపాటు కొనసాగుతున్నాయని వివరించారు. దీంతో బ్యాంకింగ్​, ఆర్థిక రంగంలో సమూల మార్పులను తీసుకురాగలిగామన్నారు. ఈ చర్యలతో వ్యాపార, వాణిజ్యాల్లో లావాదేవీల రాకడ, పోకడలు మరింత సులువయ్యాయని పేర్కొన్నారు. జన్​ ధన్​ ఖాతాలు మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. దీని కింద 29 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు. ఈ ఖాతాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే ముద్రా యోజనను ప్రారంభించి మహిళలకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అందజేస్తున్నామన్నారు. వీరు దేశ ఆర్థిక పురోగతిలో కీలక భూమిక పోషించే స్థాయికి ఎదగాలన్నదే తమ అభిమతమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.