రెండుసార్లు యుద్ధాన్ని ఆపించారు

క్షేమంగా భారతీయ విద్యార్థులు వెనక్కు జీ–20 నిర్వహణపై తీవ్ర ఒత్తిళ్లు మూడు రోజులు తీవ్ర ప్రయత్నాలు చేశాం అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చాం విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జైశంకర్​

May 22, 2024 - 12:53
 0
రెండుసార్లు యుద్ధాన్ని ఆపించారు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్​ యుద్ధాన్ని రెండు సార్లు ప్రధాని మోదీ ఆపించారని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖార్కివ్​ నుంచి భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి చేర్చేందుకు యుద్ధం పరిస్థితుల్లో అసాధ్యమని అంతా భావించారన్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ మార్చి 5న రష్యా అధ్యక్షుడు పుతిన్​కు ఫోన్​ చేశారని తెలిపారు. తమ విద్యార్థులు వెనక్కు రావాలనుకున్నా ఆ ప్రాంతంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వెనక్కు రాలేకపోతున్నారని, భారత విద్యార్థులు వెనక్కు వచ్చే వరకు కాల్పులను ఆపాలని కోరారు. మోదీ అభ్యర్థన ప్రకారం వెంటనే రష్యా అధ్యక్షుడు చర్యలు తీసుకున్నారని అన్నారు. దీంతో విద్యార్థులు క్షేమంగా వెనక్కి రాగలిగారని తెలిపారు.

మార్చి 8న ఉక్రెయిన్​, రష్​యా, మిలీషియాల మధ్య పోరాటం తీవ్రతరమైందన్నారు. కొంతమంది భారతీయ విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రధాని వెంటనే రష్​యా, ఉక్రెయిన్​ అధ్యక్షులు పుతిన్​, జెలెన్​ స్కీలతో ఫోన్​ లో మాట్లాడారని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం సురక్షిత ప్రాంతాల వరకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారని జై శంకర్​ చెప్పారు. మోదీ చర్యల వల్ల రెండోసారి కూడా యుద్ధం ఆపడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు. ఇందుకు తానే సాక్షి అని జై శంకర్​ పేర్కొన్నారు. 

ఈ రెండు ప్రయత్నాలు కాకుండా జీ–20 నిర్వహణ ద్వారా ఉద్రిక్తతలు తలెత్తుతున్న దేశాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు మోదీ ప్రయత్నించారన్నారు. పశ్చిమ దేశాలను, రష్​యాను ఒక్కతాటిపైకి చేర్చే ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ చేశారని గుర్తు చేశారు. రష్యా, ఉక్రెయిన్​ మధ్య కొనసాగుతున్న యుద్ధం సందర్భంలో బర్నింగ్​ ఇష్యూ సమయంలో కూడా పరిస్థితులను సద్దుమణిగింప చేసేలా మోదీ ప్రయత్నం చాలా మేరకు సఫలీకృతం అయ్యిందన్నారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు జీ–20 నిర్వహణపై తీవ్ర ఒత్తిళ్లను కూడా ఎదుర్కున్నామని జై శంకర్​ తెలిపారు. మూడు రోజులు నిద్ర పోకుండా ఆయా దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయవంతంగా ఈ సదస్సును నిర్వహించగలిగామని జై శంకర్​ స్పష్టం చేశారు. 
రానున్న సమయంలో ప్రపంచదేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వం, అభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలే లక్ష్యమని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ స్పష్టం చేశారు.