రైతులకు కేంద్రం మరో కానుక 14 ఖరీఫ్​ పంటలకు మద్దతు ధరల పెంపు

ఎంఎస్​ పీ ధరల పెంపునకు కేంద్ర కేబినెట్​ ఆమోదం వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

Jun 19, 2024 - 20:43
 0
రైతులకు కేంద్రం మరో కానుక 14 ఖరీఫ్​ పంటలకు మద్దతు ధరల పెంపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో కానుకనిచ్చింది. 14 ఖరీఫ్​ పంటలపై ఎంఎస్​ పీ పెంచేందుకు కేంద్ర కేబినెట్​ ఆమోదముద్ర వేసింది.  బుధవారం కేబినెట్​ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024–25కు గాను ఖరీఫ్ పంటల ఎంఎస్‌పీని పెంచామని, తద్వారా ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలను అందజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. వరికి రూ. 2300 (గతేడాది కంటే రూ. 117 ఎక్కువ), ఏ గ్రేడ్​ వరి రూ. 2320 (రూ. 117 ఎక్కువ),  జొన్న (హై బ్రీడ్​) రూ. 3371 (రూ. 191 ఎక్కువ), రాగులు రూ. 4290 (రూ. 444 ఎక్కువ), తృణధాన్యాలు రూ. 2625 (రూ. 125 ఎక్కువ), మొక్కజొన్న, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్​ నువ్వులు, పత్తి తదితర పంటలపై ఎంఎస్​పీ పంట ధరలను కేంద్రం భారీగా పెంచినట్లు అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు.