శంభు సరిహద్దుపై యథాతథ స్థితి సుప్రీం
The status quo on the Shambhu border is supreme
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హరియాణా–పంజాబ్ మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంలో చేసిన సవాల్ పై విచారణ చేపట్టింది. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కమిటీ రైతులు, ఇతర వాటాదారులతో వారి డిమాండ్లకు ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని కనుగొనడానికి సంప్రదిస్తుందని, ఇది న్యాయమైన , అందరి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని సుప్రీం తెలిపింది. కాగా గతంలో హైకోర్టు ఈ సరిహద్దును జూలై 24 వరకు తెరవాలని పేర్కొంది. ఇదే విషయంపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.