ప్రపంచంలోనే కాస్లీ ఎన్నికలు ఖర్చు రూ. 1.35లక్షల కోట్లు!

సీఎంఎస్​ అధ్యయనంలో వెల్లడి వివరాలు వెల్లడించిన సంస్థ అధ్యక్షుడు భాస్కర్​ రావు

Apr 25, 2024 - 20:32
 0
ప్రపంచంలోనే కాస్లీ ఎన్నికలు ఖర్చు రూ. 1.35లక్షల కోట్లు!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికలు 2024 భారత్​ లో జరిగే ఎంపీ ఎన్నికలేనని ఎన్డీవో సెంటర్​ ఫర్​ మీడియా స్టడీస్​ (సీఎంఎస్​) అధ్యక్షులు ఎన్​. భాస్కర్​ రావు గురువారం ఓ నివేదిక విడుదల చేస్తూ పేర్కొన్నారు. 2019 ఎంపీ ఎన్నికల కంటే ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎన్నికల ఖర్చు రెండింతలు పెరిగిందని ఆయన తెలిపారు. 2019లో రూ. 60వేల కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ఎన్నికల అంచనా వ్యయం రూ. 1.35 లక్షల కోట్లుగా ఉందన్నారు. 

అయితే మొదటి విడత ఎన్నికలు మాత్రమే ముగిశాయని పేర్కొన్నారు. ఆరుదశల్లో ఇంకా ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఇంకా ఖర్చు పెరిగే అవకాశం కూడా లేకపోలేదని ఆయన వివరించారు. రాజకీయ పార్టీలు, సంస్థలు, అభ్యర్థులు,ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ప్రత్యక్ష పరోక్ష ఖర్చులన్నింటినీ కలుపుకొని నివేదికలో పొందుపరిచామన్నారు. గత 35 ఏళ్లుగా సీఎంఎస్​ సంస్థ ఎన్నికల ఖర్చులపై నివేదికలు విడుదల చేస్తోంది. రూ. 1.2 కోట్ల ఖర్చువుతుందని మొదట్లో అంచనా వేశామన్నారు. కానీ ఎలక్టోరల్ బాండ్ వాటాను వెల్లడించిన తర్వాత, ఈ సంఖ్యను రూ. 1.35 లక్షల కోట్లకు సవరించామని భాస్కర్​ రావు వివరించారు. 

బాండ్లకు మించిన నగదు వివిధ మార్గాల ద్వారా రాజకీయ పార్టీలకు సమకూరుతోందని గుర్తించినట్లు తెలిపింది. ఏడీఆర్​ కూడా రాజకీయ పార్టీలకు అందుతున్న నిధులపై ఇటీవలే ఓ నివేదికను వెల్లడించింది.