పీఎఫ్ఐ 8మంది బెయిల్ రద్దు
మద్రాస్ కోర్టు తీర్పును విచారించనున్న సుప్రీంకోర్టు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మద్రాస్ హైకోర్టు పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) 8మంది నిందితులకు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా వాదనల సందర్భంలో ఇప్పటికే నిందితులు 16 నెలలు జైలులో ఉన్నారని మద్రాస్ కోర్టు నిందితులే దోషులనేందుకు తగిన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని నిందితుల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అందుకే బెయిల్ లభించిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది మాట్లాడుతూ.. నిందితులు దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారని సాంకేతిక ఆధారాలను సమర్పించామని పేర్కొంది. వీరంతా నిషేధిత పీఎఫ్ఐ సభ్యులుగా పేర్కొంది.
నిందితులు దేశంలో పాల్పడబోయే విద్రోహ చర్య తీవ్రమైందని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టుకు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వీరికి విదేశాలతో కూడా సంబంధాలున్నాయని కూడా పలు ఆధారాలను సమర్పించామని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ నిందితుల బెయిల్ ను రద్దు చేసింది.
మద్రాస్ ఇచ్చిన తీర్పుపై పునర్ విచారణ చేపడతామని స్పష్టం చేసింది.