షాజహాన్ ను అప్పగిస్తే పది నిమిషాల్లె లెక్క తేలుస్తా!
టీఎంసీ మమత ప్రభుత్వంపై ఆరోపణలు బీజేపీకి 30 స్థానాలు ఖాయం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
కోల్ కతా: షాజహాన్ షేక్ ను తనకు అప్పగిస్తే పది నిమిషాల్లో అతని పూర్తి లెక్కలేమిటో తేలుస్తానని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ లోని మథురాపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. టీఎంసీ మమత ప్రభుత్వం సందేశ్ ఖాలీ అక్కాచెల్లెమ్మలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. చిత్రహింసలకు గురయితే తమ పార్టీ నేతను కాపాడుకునేందుకు ఆఖరుకు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత సచ్ఛీలుడే అయితే రెండు నెలలు ఎందుకు తప్పించుకు తిరిగాడని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకునే బదులు అతన్ని తప్పించింది మమతే అన్న ఆరోపణలు కూడా లేకపోలేదని శర్మ ఆరోపించారు. ఇలాంటి గుండాలను మమత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. భూకబ్జాలు, లైంగిక దోపిడీ, అవినీతి, అక్రమాలకు పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రభుత్వం కేరాఫ్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలు జరిపేందుకు దర్యాప్తు సంస్థలు వస్తే వారిపై కూడా దాడులకు పాల్పడేంత ధైర్యాన్ని ఎవరు నూరిపోశారని నిలదీశారు. మమత పాలనను ప్రజలు తిరస్కరించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ రాష్ర్టంలో బీజేపీకి 25 నుంచి 30 స్థానాలను కైవసం చేసుకుంటుందని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు.