సైనికుల పరాక్రమం ఎనలేనిది
విజయ్ దివస్ సైనికులకు రాష్ట్రపతి ముర్మూ నివాళులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ సాయుధ బలగాల ధైర్యసాహసాలు, పరాక్రమాలు ఎనలేనివని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం రాష్ర్టపతి అమరవీరులకు నివాళులర్పించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. భారతమాతను కాపాడడంలో సైనికులకు సాటి ఎవరూ లేరన్నారు. దేశ ప్రజలంతా సైనికుల త్యాగాలు, పరాక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ర్టపతి ముర్మూ పేర్కొన్నారు.